janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 5:38 pm Digital Edition : GATTU MAHESH

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి.

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి.

– కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకలు.
– చిన్నారుల క్రీడలను ఆసక్తిగా తిలకించిన సీఎం.
– ముగ్గులు, విజేతలకు బహుమతులు – అర్జీల స్వీకరణ.

జనం వాయిస్, నారావారిపల్లె:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి పాల్గొని గ్రామస్తులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారుల కోసం సంగీత కుర్చీలు, సమతుల్య నడక, గన్నీ సంచుల పరుగు, నిమ్మకాయ–చెంచా పోటీ, సంప్రదాయ కోడి పందెం, మూడు కాళ్ల పరుగు, గ్లాస్–బెలూన్ పరుగు వంటి క్రీడలను నిర్వహించారు. ఈ క్రీడలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తిగా తిలకిస్తూ చిన్నారులతో కలిసి సంతోషంగా గడిపారు. విజేతలకు స్వయంగా బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.
చిన్నారులందరితో కలిసి ఫోటోలు దిగిన ముఖ్యమంత్రి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించి, వారికి బహుమతులు అందజేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ వాతావరణంలో ప్రజలతో మమేకమై పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.