janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 10:08 am Digital Edition : GATTU MAHESH

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.

బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.

• ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి ప్రిన్సిపాల్ స్రవంతి.

జనం వాయిస్, పఠాన్ చెరు:

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో  బీసీ,ఎస్సీ, ఎస్టీ ఏడాదికి సీట్లు భర్తీకి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు జనవరి, 25 వరకు పెంచారు. బీసీ గురుకుల మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ  తరగతిలో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బీసీ గురుకుల మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల అల్లాదుర్గ్, ఐనోల్ ప్రిన్సిపాల్ బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్రవంతి తెలిపారు. అర్హత పరీక్ష  ఆధారంగా విద్యార్థుల సీట్ల ఎంపిక జరుగుతుందని అన్నారు. కావున అర్హత కలిగిన బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విద్య పౌష్టికాహారం, యూనిఫామ్, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా అందించనున్నమని కావున అర్హత కలిగిన విద్యార్థులు  ఈనెల 25వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ స్రవంతి కోరారు.