janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 3:49 pm Digital Edition : JANAM VOICE

ఎలక్ట్రికల్ బస్సులు సురక్షితమేనా..?

ఎలక్ట్రికల్ బస్సులు సురక్షితమేనా..?

కరీంనగర్లో మూడవసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం.
డిపోలో పార్కింగ్ చేసిన బస్సులో చెలరేగిన మంటలు.

జనం వాయిస్, కరీంనగర్, జూలై 01:

కరీంనగర్లో మూడవసారి ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డిపోలో పార్కింగ్ చేసిన బస్సులో  మంటలు చెలరేగాయి. ఇటీవల జరిగిన తిమ్మాపూర్ ఎలక్ట్రిక్ బస్సు అగ్నిప్రమాదంపై ఇంకా నిపుణులు ఎటూ తేల్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 2024లో జేబీఎం సంస్థ నుంచి  ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుచేసింది. మూడవసారి అగ్నిప్రమాదంతో బస్సుల నాణ్యతపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తాయి. ఈనేపధ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్స్ తాత్కాలికంగా నిలిపివేసారు.