మంథని తహసీల్దార్ కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపి వేయాలి.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ డిమాండ్.
జనం వాయిస్, మంథని:
మంథనిలో సమీకృత డివిజనల్ ఆఫీసులు నూతనంగా ఏర్పాటు చేయడంలో భాగంగా మంథని తాసిల్దార్ కార్యాలయాన్ని నామమాత్రంగా ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ మంథని తాసిల్దార్ కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడుతుందని ఎమ్మార్వో కార్యాలయానికి ప్రజలు నిత్యం వస్తుంటారని ప్రజలు రావడం వలన విద్యార్థులకు చదువుకోవడానికి ఆటంకాలు ఏర్పడతాయని అన్నారు.ఎమ్మార్వో కార్యాలయాన్ని ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసుకోవాలని అధికారులను హెచ్చరించారు.గతంలో కూడా బాలికల హాస్టల్ ను కూలగొట్టి ఆ స్థలంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఇలా విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ భవనాల్లో వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని మరో కార్యాలయాన్ని ఇంటిగ్రేడ్ హాస్టలల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయకుంటే విద్యార్థులను కలుపుకొని కార్యాలయ ఏర్పాటను నిలిపే వరకు అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకలసురేష్ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజకుమార్,సాయి,శ్రీశాంత్,రాజేష్ ,సిద్ధూ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.