మృగశిర చేప ప్రసాదానికి ఏర్పాట్లు.

మృగశిర చేప ప్రసాదానికి ఏర్పాట్లు.- జూన్ 8న నాంపల్లిలో కార్యక్రమం.- భారీగా భక్తులు వచ్చే అవకాశం.- భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి.జనం వాయిస్, హైదరాబాద్, మే 15: హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ ఏడాది జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో...