నారాయణపూర్ లో సమ్మక్క సారలమ్మ దుకాణాల వేలం.
జనం వాయిస్, సుల్తానాబాద్ :
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్, కొదురుపాక గ్రామాల మధ్య జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర దుకాణాల వేలం నారాయణపూర్ లోని గ్రామపంచాయతీ వద్ద బహిరంగ వేలం పాట నిర్వహించారు. కొబ్బరికాయలు, బెల్లం-రూ. 73000 లు, తల్లి ఆరాధన (కోళ్లు )-రూ.34000లు, లడ్డు పులిహోర -రూ.33000లు, తలనీలాలు-రూ. 33000లు, శీతల పానీయాలు-రూ. 1,80,000 రూపాయలకు వేలం వేయడం జరిగిందన్నారు. మొత్తం వేలం రాబడి 3,53,000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడుగుల సతీష్, ఉప సర్పంచ్ రామారావు,మాజీ ఎంపీటీసీ సభ్యులు మండల రమేష్, సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ పోల్సాని తిరుపతిరావు, కొదురుపాక సర్పంచ్ ఉత్తం కుమారి,ఉపసర్పంచ్ తిరుపతిరావు, మాజీ సర్పంచ్ సాగర్ రావు,ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ శేఖర్,వార్డు సభ్యులు కల్లేపల్లి దేవేందర్,గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తోపాటు పలువురు పాల్గొన్నారు.