janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 12:59 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణలో నేటి నుండి ఆటోలు బంద్!

తెలంగాణలో నేటి నుండి ఆటోలు బంద్!

జనం వాయిస్, వెబ్ డెస్క్, ఆగష్టు 23:

తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఈ నెల 23న అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రతి ఏటా రూ.12,000 ఆర్థిక సహాయం, డ్రైవర్ల రక్షణకు సంక్షేమ బోర్డు, రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.