బలగం సినిమా వేణు మరో సంచలనం.
‘ఎల్లమ్మ’ గ్లింప్స్ విడుదల: సంచలనాత్మక కొత్త అవతారంలో రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్.
జనం వాయిస్, సినిమా:
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తన తరువాతి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’తో మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ చిత్రంలో సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా పరిచయమవుతున్నాడు. ఇది ఆయన పూర్తి స్థాయి యాక్టింగ్ ఎంట్రీగా భారీ అంచనాలు రేపుతోంది.
సాయంత్రం 4:05 గంటలకు ‘ఎల్లమ్మ గ్లింప్స్’ యూట్యూబ్‌లో విడుదలైంది. “This is faith. This is tradition. And resistance born from the soil” అనే భావోద్వేగపూరిత క్యాప్షన్‌తో విడుదలైన ఈ గ్లింప్స్‌లో గ్రామీణ నేపథ్యం, సంప్రదాయాలు, భక్తి, నిరోధకత వంటి అంశాలు ప్రతిబింబిస్తున్నాయి.
దేవి శ్రీ ప్రసాద్ అనూహ్యమైన కొత్త అవతారంలో డ్రమ్స్‌తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతను పర్సి అనే హీరో పాత్రలో కనిపించనున్నాడు.
“Presenting Rockstar DSP who has always rocked your hearts with blockbuster music now in a new avatar” అంటూ మేకర్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీఓపీగా ఆచార్య వేణు పని చేస్తున్నాడు.
ఈ సినిమా కథ తెలంగాణ గ్రామీణ సంస్కృతి, గ్రామదేవత ఎల్లమ్మ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. భావోద్వేగపూరిత కథాంశంతో పాటు సంగీతం, సాంప్రదాయిక అంశాలు హైలైట్‌గా నిలుస్తాయి. మరిన్ని వివరాలు, హీరోయిన్ పేరు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Glimpse link
https://youtu.be/6SaQ3mey3-A?si=kwtJnQ77EH7eBCMK