ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.జనం వాయిస్, సుల్తానాబాద్, అక్టోబర్ 06: ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, బాలికల హాస్టల్, విద్యుత్ వ్యవస్థ, పాఠశాల పరిసరాలు, క్రీడా...