తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.
తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన తొమ్మిది రోజుల ఉత్సవాలు. సంప్రదాయ వస్త్రాల్లో మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాంస్కృతిక అస్థిత్వానికి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ...