ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి.
జనం వాయిస్, జయశంకర్ భూపాలపల్లి :
ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో దాతల సహకారముతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రములోని స్థానిక హనుమాన్ టెంపుల్ ప్రక్కన గుడిసెలలో నివాసం ఉంటున్న వలస కూలీలకు దుప్పట్లు పంపిణి చేసినట్లు ఆత్మీయత సేవా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ తెలిపారు.ఈ సందర్బంగా ఆత్మీయత సేవా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ ఈ కార్యక్రమమునకు సహకరించిన దాతలకు సొసైటి తరుపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమములో సొసైటి సభ్యులు బయ్యన మహేందర్,మాటూరి క్రాంతికుమార్, పఠాన్ షాకీర్, బండి శ్రీనివాస్, సెగ్గెం దేవేందర్, రూప్ సింగ్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.