- పాముకాటుకు గురైన ఉపాధిహామీ కూలికి మెరుగైన వైద్యం అందించాలి.
- అత్యవసర వైద్య సహాయ నిధులను తక్షణమే విడుదల చేయాలి.
- పని ప్రదేశంలో పాము కాటు మందులను అందుబాటులో ఉంచాలి.
- శీలంశేట్టి రమేష్ మాజీ ఎంపీటీసీ.
- గార్ల /జనం వాయిస్ :
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైన బానోత్ సెట్ రామ్ కు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని గార్ల మాజీ ఎంపీటీసీ శీలంశేట్టి రమేష్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ముత్తితండ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ బానోత్ సెట్ రామ్ ఉపాధి హామీ పనులు చేస్తున్న క్రమంలో పనిప్రదేశంలో ప్రమాదవశాత్తు పాము కాటుకు గురయ్యారని తెలిపారు. మండల కేంద్రంలో గల కమ్యూనిటీ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న నిరుపేద ఉపాధికూలిని మెరుగైన వైద్యం కొరకు అవసరమైతే కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో ప్రమాదానికి గురైన ఉపాధి కూలీకి ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి హామీ పథకంలో భాగంగా అత్యవసర వైద్య సహాయ నిధులను తక్షణమే విడుదల చేయాలి కోరారు.పాముకాటుకు గురైన సెట్ రామ్ కోలుకుని మళ్లీ పనిలోకి వచ్చే వరకు వారి కుటుంబం గడవడం కోసం ప్రభుత్వం తక్షణ సాయంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి డిమాండ్ చేశారు.పని ప్రదేశాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పనులకు వెళ్లే కూలీల రక్షణ కోసం పని ప్రదేశాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పాముకాటు విరుగుడు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఒక పేద కూలీ కుటుంబం రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,అధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనీ లేనిపక్షంలో ఉపాధి కూలీలందరితో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.