janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 6:37 pm Digital Edition : JANAM VOICE

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి విక్రమార్క మల్లు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భట్టి విక్రమార్క మల్లు.

సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వాన పత్రిక అందజేత.

కుటుంబ సమేతంగా విచ్చేయాలని ఆహ్వానం.

జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 01:

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క మల్లు ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు తెలిసింది. కార్యక్రమ వివరాలను తెలియజేసి సాదరంగా ఆహ్వానించారు.

ఈ భేటీలో పరస్పర శుభాకాంక్షలు మార్చుకున్నట్లు సమాచారం. సూర్య విక్రమాదిత్య వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఆనందోత్సవంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల సాన్నిధ్యం ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. వివాహ వేడుక విజయవంతంగా జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు సమాచారం.