ఎలికేశ్వరం శివారులో యువకుడి మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానాలు…?
ఎలికేశ్వరం శివారులో యువకుడి మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానాలు...? మహాదేవపూర్ మండలంలో కలకలం. జనం వాయిస్, మహాదేవపూర్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం శివారులో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. బొమ్మపూర్ గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (27) మూడు రోజుల క్రితం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఎలికేశ్వరం శివారులో శ్రీకాంత్...