రైతులకు బోనస్ చెల్లించాలి
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర కమిటీ సభ్యులు పైడిపల్లి తిరుపతి.
జనం వాయిస్,జమ్మికుంట,కరీంనగర్:
అన్నదాతలైన రైతులకు ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని, రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర కమిటీ సభ్యులు పైడిపల్లి తిరుపతి అన్నారు. యాసంగి పంటకు ఇప్పటివరకు బోనస్ డబ్బులు అందించలేదని, బోనస్ వస్తుందని ఆశతో రైతులు ప్రభుత్వరంగ సంస్థలకు ధాన్యం విక్రయించారని, ఆరు నెలలు గడిచిన ఇప్పటివరకు వేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాన కాలంలో కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బోనస్ డబ్బులు జమ కాలేదని ఆయన అన్నారు. గత యాసంగి, వానకాలం ధాన్యముకు బోనస్ చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఇటిక్యాల స్వరూప, జమ్మికుంట మండల అధ్యక్షులు పాపయ్య, పట్టణ వాసం వెంకటేష్, ఉపాధ్యక్షులు మల్లాడి మల్లారెడ్డి, లలిత, హేమలత, తదితరులు పాల్గొన్నారు.