యూపీఐ ద్వారా రూ.14 లక్షల 77 వేల లంచం.
– కరీంనగర్ ఏసీబీ వలలో సూపరింటెండెంట్.
జనం వాయిస్, కరీంనగర్:
పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్న కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఈగల మధుసూధన్ ఏసీబీకి దొరికిపోయాడు. సంవత్సర కాలంలో రూ.14,77,003 లంచాలుగా యూపిఐ ద్వారా తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించారు. భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లోని ఒక బినామీ ఖాతాను ఉపయోగించి ఈ లంచాలు తీసుకున్నట్లు నిర్దారించారు.