కాంగ్రెస్ నాయకులు అవినీతి చేస్తున్నారు.
జనం వాయిస్, బెల్లంపల్లి:
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోయారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ఇష్టానుసారంగా మాట్లాడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహించారు. బెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లయ్య 34 వార్డులలో ఏజెంట్లను పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. రూ.50వేలు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు.