తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా బూడిద గణేష్ ఎన్నిక.
జనం వాయిస్, మంథని, జూన్ 23:
ఈనెల 20, 21, 22 తేదీలలో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభల్లో పెద్దపల్లి జిల్లా మంథని నుండి బూడిద గణేష్ ను రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ…పెద్దపల్లి జిల్లాలో శ్రమజీవులు కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించి జిల్లాలో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. అణిచివేయబడుతున్న అణగారిన ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ పేద ప్రజల గుండెచప్పుడుగా ప్రజల గొంతుకగా వ్యవసాయ కార్మిక సంఘం నిలుస్తుందని అన్నారు. శ్రమ దోపిడీకి బానిసత్వానికి కుల వివక్షతకు గురవుతున్న కార్మికులను కర్షకులను సంఘటితం చేసి కార్మిక కర్షక మైత్రి కోసం కృషి చేస్తామని తెలియజేశారు. దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం ఎర్రజెండా అండగా ఉంటుందని తెలియజేశారు. తన ఉద్యమ ప్రస్థానంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న శ్రేయోభిలాషులకు మేధావులకు అభ్యుదయ వాదులకు ప్రజాతంత్ర వాదులకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.