janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 6:00 pm Digital Edition : JANAM VOICE

ఎదురు ఎదురుగా ఢీకొన్న కారు బైక్.

ఎదురు ఎదురుగా ఢీకొన్న కారు బైక్.

  • ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు.
  • కుడి కాలు కుడి చేతికి బలంగా గాయాలు.
  • జనం వాయిస్, గోదావరిఖని, మే 28:
  • పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం  ప్రమాదం చోటుచేసుకుంది. 8 ఇంక్లైన్ ఆర్ జి 2 వకీల్ పల్లి గనిలో బదిలీ వర్కర్ గా పనిచేస్తున్నాడు. గురువారం రెండవ షిఫ్ట్ కి హాజరవ్వడానికి వెళ్తున్న సింగరేణి కార్మికుడు తోటి కార్మికుడిని పికప్ చేసుకొని పెట్రోల్ పోసుకొని వెళ్దాం అని సెంటినరీ కాలనీకి వెళ్తున్న క్రమం లో జేఎన్టీయూ సమీపం లో సెంటినరీ కాలనీ నుంచి వస్తున్న కారు నవీన్ అనే సింగరేణి ఉద్యోగి నీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో నవీన్ సింగరేణి కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్ యొక్క కుడి కాలు లోపలి నుంచి గాయం అయింది. కుడి చేతి విరిగి లోపల ఎముక భాగం బయటికి రావడం తో తీవ్రమైన రక్త స్రావం అయింది. గాయపడ్డ వ్యక్తి నీ స్థానికులు గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పటల్ కి తరలించారు. మెరుగయిన వైద్యం కోసం గచ్చిబౌలి ఒమేగా హాస్పటల్ కి తరలిస్తున్నారు. కారు లో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పారిపోయినట్టు బాధితుడు తెలిపాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధిన వివరాలను సేకరిస్తున్నారు.