జనం వాయిస్, హుజురాబాద్ :
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీణవంక సమ్మక్క సారక్క జాతరకు హాజరయ్యేందుకు అనుమతి లేకుండా ధర్నా, రాస్తారోక నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలకు విగాథం కలిగించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను హుజూరాబాద్ పోలీసులు కౌశిక్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.