గోదావరిఖని లో గొలుసు దొంగ.
జనం వాయిస్, గోదావరిఖని, మే 17:
గోదావరిఖని తిలక్ నగర్ లో ఆదివారం ఉదయం ఓ ఆగంతకుడు మహిళ మేడలో నుంచి గొలుసును దొంగిలించాడు. ఆమె ఇంటిముందు నడుచుకుంటూ వెళ్తున్న సమయం లో హీరో హోండా గ్లామర్ బైక్ పై నెంబర్ లేకుండా వచ్చి గొలుసును దోచుకెళ్లాడు. వెంటనే ఆ మహిళ పోలీస్ లకు పిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. అదే లైన్ లో ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా లో చోరీ కి సంబంధించి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా లో రికార్డ్ లను పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.