లక్సెట్టిపేట కౌంటింగ్ లో గందరగోళం.
అభ్యర్ధుల అందోళన.
జనం వాయిస్, మంచిర్యాల:
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం ఏర్పడింది. మూడో వార్డుకు సంబంధించి రెండు బ్యాలెట్ బాక్స్ లకు కవర్ సీల్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేసారు.