తనుగుల చెక్‌డ్యామ్ పేల్చివేతపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు.
-కలెక్టర్‌కి నివేదిక, కఠిన చర్యలు కోరిన నేతలు.
-జమ్మికుంట మండలంలో చెక్‌డ్యామ్ ధ్వంస ఘటన కలకలం.
-బాధ్యులపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్.
-మాజీ మంత్రులు–ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు.
జనం వాయిస్, కరీంనగర్ :
జమ్మికుంట మండలంలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను దుండగులు పేల్చివేసిన ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆక్షేపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమాలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణ రావు తదితరులతో కూడిన బృందం గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు అందించారు. క్‌డ్యామ్ విధ్వంసం ప్రజల ఆస్తిపై దాడితోసమానం అని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. చెక్‌డ్యామ్ పగులగొట్టడంతో సాగునీరు, తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని, పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే విచారణ చేసి నిజానిజాలు వెలికితీయాలని కలెక్టర్‌ను కోరారు. ర్యాదులో చెక్‌డ్యామ్ పేల్చడానికి ఉపయోగించిన పేలుడు పదార్థాలు, సంఘటన జరిగిన సమయం, పరిసరాల్లో ఉన్న అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అధికారులు పరిశీలించాలని నేతలు సూచించారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన నీటి వనరులపై దాడి చేయడం, గ్రామాల అభివృద్ధిని దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నుగుల చెక్‌డ్యామ్ ఘటనపై ఇప్పటికే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదుతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్‌కు ఫిర్యాదు అందిన వెంటనే అధికార యంత్రాంగం మైదానంలోకి దిగి ప్రాథమిక వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు.