రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
జనం వాయిస్,వెబ్ :
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి బృందంతోపాటు, గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు సైతం పోస్టుమార్టంలో పాల్గొనాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు వైద్యుల బృందం వెళ్లింది.మరోవైపు క్షతగాత్రుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. బాధితులు వస్తే చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గాంధీ వైద్యుల బృందం తెలిపింది