పల్లె ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుగొమ్మలు
పల్లె ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుగొమ్మలు -ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య జనం వాయిస్, కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులు,గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు.పల్లె ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుగొమ్మలని,ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విలువల ఆధారిత విద్యను అందిస్తున్నారని,ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో సమానత్వం,సమైక్యతను కాపాడే అనేక వినూత్నమైన,సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఫలితంగా పల్లె ప్రాంతాలు క్రమక్రమంగా అభివృద్ధి బాటలో...