కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి.
– పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.
జనం వాయిస్, పెద్దపల్లి:
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.జూలపల్లి మండలంలోని వడ్కాపూర్, వెంకట్రావుపల్లి, కుమ్మరికుంట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో బుధవారం రోజున ప్రచారం నిర్వహించి సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ నమూనాలతో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. గత 10 యేండ్ల బిఆర్ఎస్ పాలనలో వడ్కాపూర్, వెంకట్రావుపల్లి మరియు కుమ్మరికుంట గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. అలాగే రైతులు పండించిన వరి ధాన్యం కటింగ్ చేసి జూలపల్లి మండల రైతులను మోసం చేసిన ఘనత బి.ఆర్.ఎస్ ప్రభుత్వనిది, వారి నాయకులది అని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాల పట్ల, ప్రజలు సంతోషంగా ఉన్నారని అలాగే పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కానీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఉచిత కరెంట్, సన్న బియ్యం, సన్న వడ్లపై బోనస్, కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు, రెండు లక్షల రుణమాఫీ, ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలు గ్రామాల ప్రజలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.