కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం..!
జనం వాయిస్, కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా:డిసెంబర్ 03
కామారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత సంచారం ప్రజలకు తీవ్ర భయాందోళ నలకు గురిచేస్తోంది. కామారెడ్డి -ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కొట్టాల్ గ్రామ శివారులో చిరుత కనిపించడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జంకుతున్నారు.
మంగళవారం రాత్రి కామారెడ్డి, నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ఈ చిరుతను గమనించారు. కొట్టాల్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారికి ప్రక్కన ఉన్న అడవిలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షమైంది.
దీనిని చూసిన బస్సు ప్రయాణికులు భయంతో కేకలు వేయడంతో,చిరుత వెంటనే పొదల్లోకి పారి పోయింది. ఈ సంఘటనతో కొట్టాల్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చిరుత కనిపించిన ప్రాంతం ప్రధాన రహదారికి దగ్గరగా ఉండ టంతో,ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తీవ్ర భయంతో వణికిపోతు న్నారు.
చిరుత సంచారం పై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.