కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం..!

కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం..! జనం వాయిస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా:డిసెంబర్ 03కామారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత సంచారం ప్రజలకు తీవ్ర భయాందోళ నలకు గురిచేస్తోంది. కామారెడ్డి -ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కొట్టాల్ గ్రామ శివారులో చిరుత కనిపించడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జంకుతున్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి, నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులు ఈ చిరుతను గమనించారు. కొట్టాల్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారికి ప్రక్కన ఉన్న అడవిలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షమైంది....