బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చొప్పరి సదానందం.
జనం వాయిస్, ముత్తారం:
ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వాళ్ళ పెద్దనాన్న దొడ్డ రాజయ్య అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకోని ప్రగాఢ సంతాపం తెలిపారు. అతని వెంట కమాన్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ముత్తారం మండలం మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా, ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, అడవి శ్రీరాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు దేశిని రాజేశం, ఉప సర్పంచ్ అనవేన హరిత తిరుపతి, మరియు వార్డు సభ్యులు దామ మదన్, తుమ్మల సదయ్య, మార్త మహేందర్, సాదా స్వామి కోమలత, కాంగ్రెస్ నాయకులు తోడేటి శశి కుమార్, గట్టు సదయ్య, నాంసాని సదయ్య, భూపెల్లి సుదర్శన్, మారుపాక మధుకర్, లక్కం రాజు, రామ్ రాజయ్య, కలవైన సదయ్య, బందెల మల్లయ్య, మూగ రాజేశం, పొలం ఎల్లయ్య తదితరులు ఉన్నారు.