janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 7:54 pm Digital Edition : GATTU MAHESH

యేసుక్రీస్తు జన్మ పవిత్రమైనది.

యేసుక్రీస్తు జన్మ పవిత్రమైనది.

-టీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్.

జనం వాయిస్,మంథని,డిసెంబర్ 03:

యేసుక్రీస్తు జన్మ అత్యంత పవిత్రమైనదని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్ అన్నారు.బుధవారం మంథని మండలం సిరిపురం గ్రామ సెనగోగు ప్రార్ధన మందిరంలో  మంథని మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ (ఎంఎంయూపీఎఫ్) ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సంతోషం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సహ పంక్తి భోజనాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంథని డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కాంపెల్లి దాస్, జాన్ పాల్, ఎంఎంయుపిఎఫ్ అధ్యక్షులు కలువల సామెల్, ప్రధాన కార్యదర్శి సుందిళ్ల అబ్రహం, ఉపాధ్యక్షులు ఆరుమల్ల ఎలీషా, సహాయ కార్యదర్శి అక్కపాక జోసెఫ్, కోశాధికారి మంథని మార్కు, కార్యనిర్వాహక సభ్యులు దూడ మహేష్, అజ్మీరా దయరాజు, నిట్టూరి సత్కీర్తి, బడికెల సాత్విక్, కన్నూరి కృపావరం, వడ్ల డేవిడ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.