2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సీఐ, ఎస్సై.
జనం వాయిస్, రంగారెడ్డి:
నకిలీ పాస్ పోర్ట్ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సంపతి కనకయ్య, ఎస్సై సిద్దేశ్వర్, రూ” రెండు లక్షలు లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డా రు. ఈ దాడులు మంగళ వారం సాయంత్రం ప్రారంభ మై అర్ధరాత్రి వరకు కొనసాగాయి, రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల పట్టు పడ్డాడు శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది, అతడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కొద్దిరోజుల తర్వాత జైలు నుంచి అతడు రిలీజ్ అయ్యాడు, నేపథ్యంలో అతడు ప్రతి వారం పోలీస్ స్టేషన్కు హాజరవుతున్నాడు ఈ కేసులో ఛార్జ్ సీట్ ధాఖలు చేయడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుకయ్య ఎస్సై సిద్ధేశ్వర్,తో కలిసి బాధితుడి నుంచి 15 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొదట 5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది,మొదట విడుతగా రెండు లక్షలు ఇస్తానని చెప్పి బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యించాడు. మంగళవారం సాయంత్రం ఔట్ పోస్టు స్టేషన్లో బాధితుడి నుండి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్, ఆధ్వర్యంలో లంచగొండి పోలీస్ అధికా రులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.