చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోపై దర్యాప్తు వేగం
చిరంజీవి డీప్‌ఫేక్ వీడియోపై దర్యాప్తు వేగం-పోలీసులు ఖాతాను బ్లాక్ చేశారు.జనం వాయిస్,హైదరాబాద్,అక్టోబర్ 31: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సైబర్ నేరగాళ్లు సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలను అధికారులు తొలగించారు. ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో “దయా చౌదరి” పేరుతో ఉన్న ఖాతా నుంచి ఈ వీడియోలు పోస్ట్ చేయబడ్డాయని. ఆ ఖాతాను ఇప్పటికే బ్లాక్ చేయించినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు...