janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 4:40 pm Digital Edition : GATTU MAHESH

అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ సత్తా.

అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ సత్తా.

– ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు.
– మహిళా బ్రాస్ బ్యాండ్‌లో స్వర్ణ పతకం
– ఓవరాల్ చాంపియన్ అవార్డు దక్కించుకున్న సీఐఎస్ఎఫ్.
– ఉత్తమ కండక్టర్‌గా బ్యాండ్ మాస్టర్‌కు పురస్కారం.

జనం వాయిస్, హైదరాబాద్:

హైదరాబాద్‌లో నిర్వహించిన 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా బ్యాండ్ అద్భుత ప్రదర్శనతో జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవాలు అందుకుంది. క్రమశిక్షణ, లయబద్ధత, వృత్తిపరమైన ప్రతిభతో ఆకట్టుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ మహిళా విభాగంలో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి అందరి ప్రశంసలు పొందింది.
ఈ పోటీల్లో మహిళా బ్రాస్ బ్యాండ్ విభాగంలో సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వేదికపై ప్రదర్శించిన సంగీత లయ, సమన్వయం, సైనిక క్రమశిక్షణ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. జడ్జీల నుంచి కూడా అత్యధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
అంతేకాకుండా, సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్‌కు చెందిన బ్యాండ్ మాస్టర్‌కు ‘ఉత్తమ కండక్టర్ అవార్డు’ లభించింది. బ్యాండ్ సభ్యులను సమన్వయంతో నడిపించిన నాయకత్వం, సాంకేతిక నైపుణ్యం, కళాత్మకతకు ఈ అవార్డు దక్కిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఘన విజయం సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాటిస్తున్న ఉన్నత ప్రమాణాలు, బృంద సమన్వయం, కట్టుదిట్టమైన శిక్షణకు నిదర్శనంగా నిలిచింది. దేశ భద్రతతో పాటు సాంస్కృతిక రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుతూ, యువతకు ప్రేరణగా నిలుస్తున్న సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ సాధించిన ఈ విజయంపై పలువురు అభినందనలు తెలియజేశారు.