ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలి.- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలి.- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.- ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’పై ప్రత్యేక దృష్టి.- ప్రతి నెల గ్రామసభలు, హెల్త్ క్యాంపులకు సూచనలు.- సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహణ.జనం వాయిస్, అమరావతి, మార్చి 31: రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగుదలకు అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆరోగ్య పరిరక్షణను సమగ్ర ఉద్యమంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని...