అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి
అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి. - రైతులకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. - సీఎం చంద్రబాబు ఆదేశాలు. జనం వాయిస్,అమరావతి,అక్టోబర్ 31:రాజధాని అమరావతి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈరోజు క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన రాజధాని నిర్మాణ పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను విపులంగా పరిశీలించారు. ఈ సమావేశంలో మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్,...