ఈషా సింగ్‌కు సీఎం అభినందనలు.
ఈషా సింగ్‌కు సీఎం అభినందనలు.ప్రపంచ కప్‌లో చారిత్రాత్మక ఘనత.ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఈషా.తెలంగాణ గర్వకారణమన్న ముఖ్యమంత్రి.జనం వాయిస్, హైదరాబాద్, మే 28: అంతర్జాతీయ షూటింగ్ క్రీడల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఈషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో నలభై మూడు లక్ష్యాలను విజయవంతంగా...