ఓయూ పర్యటనకు సీఎం రేవంత్.
జనం వాయిస్, హైదరాబాద్:
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉస్మానియా విశ్వవిద్యా లయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు ప్రకటించిన నేపథ్యంలో, బుధవారం ఆర్ట్స్ కాలేజీ భవనం వద్ద ఉదయం 11 గంటలకు “సర్వం సిద్ధం” పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు.