janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 1:04 pm Digital Edition : JANAM VOICE

సీఎం రేవంత్ రెడ్డికి త్రుటీలో తప్పిన పెను ప్రమాదం!

సీఎం రేవంత్ రెడ్డికి త్రుటీలో తప్పిన పెను ప్రమాదం!

జనం వాయిస్, హైదరాబాద్, జూలై 30:

సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది ఢిల్లీ నుండి ఇండిగో (6e717)విమానంలో ప్రయాణించిన ముఖ్యమంత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సమయంలో విమా నానికి విమానయాన ఎ టి ఎఫ్ నుంచి  అవసరమైన క్లియరెన్స్ అందలేదు. దీంతోపైలట్ విమానాన్ని రన్ వే ఫై ల్యాండింగ్ చేసినట్లే చేసి పైలట్  మళ్లీ టేకప్ తీసుకున్నాడు. 20 నిమిషాల పాటు విమానం గాల్లో చెక్కర్లు కొడుతూ రాత్రి 8:30 గంటలకు ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయం లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి తో పాటు విమానంలో 229 మంది ప్రయాణికులు  ఉన్నారు.ఏం జరుగు తుందో తెలియక కాసేపు సెక్యూరిటీ అధికారులు ఆందోళన చెందారు.