janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 1:49 pm Digital Edition : GATTU MAHESH

భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.

భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.

– తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భోగి.
– ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి.
– ఆనందంగా సంక్రాంతి–కనుమ పండుగలు జరుపుకోవాలి.

జనం వాయిస్, హైదరాబాద్‌:

భోగి పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి అనేది తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ అని పేర్కొంటూ, ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగి పండుగ కొత్త ఆరంభాలకు నాంది పలికే రోజు అని ముఖ్యమంత్రి తెలిపారు. పాత బాధలు, కష్టాలను విడిచిపెట్టి కొత్త ఆశలు, కొత్త కాంతులతో ముందుకు సాగాల్సిన సమయం ఇదని అన్నారు. ఈ పండుగ ద్వారా సానుకూల ఆలోచనలు, సామాజిక ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. సంక్రాంతి, కనుమ పండుగలు రైతాంగ జీవనంతో విడదీయరాని బంధం కలిగి ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన ఆనందం ఈ పండుగల్లో ప్రతిబింబిస్తుందని, గ్రామీణ సంస్కృతి, తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరగాలని సూచించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా పండుగలను జరుపుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సంక్రాంతి కాలం రాష్ట్ర ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ తన సందేశాన్ని వెల్లడించారు.