తెలంగాణకు చల్లటి కబురు.

తెలంగాణకు చల్లటి కబురు.నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు.ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణ మార్పులు.ఎల్లుండి నుంచి మళ్లీ పెరగనున్న ఎండల తీవ్రత.జనం వాయిస్, హైదరాబాద్, మే 18: భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. రాష్ట్రంలో ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత...