ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై కలెక్టర్ కు ఫిర్యాదు.
జనం వాయిస్, ముత్తారం, జనవరి12:
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలో ఉపాధి హామీ పనిలో అవకతవకలు జరిగాయని ఆ గ్రామానికి చెందిన ఇట్టం గట్టయ్య సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఉపాధి హామీ పనికి హాజరుకాని వ్యక్తుల పేర్లను హాజరైనట్లుగా చూపించి వారి పేర్లతో డబ్బులను వసూలు చేసినట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. 2019 వ సంవత్సరం నుండి 2024 వ సంవత్సరం వరకు జరిగిన ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని వెంటనే వారు చేసిన అవినీతిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.