janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 4:49 pm Digital Edition : GATTU MAHESH

ఘనంగా కాంగ్రెస్ పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు చిలుక సతీష్ జన్మదిన వేడుకలు.

ఘనంగా కాంగ్రెస్ పార్టీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు చిలుక సతీష్ జన్మదిన వేడుకలు.

జనంవాయిస్, సుల్తానాబాద్:

సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యువ నాయకులు  చిలుక సతీష్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు,ఆత్మీయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిలుక సతీష్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు
సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మానసిక వికలాంగుల కేంద్రంలో వికలాంగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా నారాయణపూర్ మాజీ ఎంపీటీసీ మండల రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే సమస్యలపై పోరాటం తత్వం చిలుక సతీష్ దని, సుల్తానాబాద్ మండలంలో ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుంటే మానవత వాది అని అన్నారు. ఇలాంటి యువ నాయకుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోషించాలని అభిమానులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఒర్రె అజయ్, కోదాటి కిరణ్, తొగర్రాయి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం అనిల్, చిలుక మల్లేష్, చిలుక శ్రీనివాస్, వినయ్, కళ్లెపెళ్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.