డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.
డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.- సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం.- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.- ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభం.జనం వాయిస్, హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి అనే పోలీసు సిబ్బంది తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు....