వివాహితపై కానిస్టేబుల్‌ అత్యాచారం.

వివాహితపై కానిస్టేబుల్‌ అత్యాచారం.వీడియోలతో బెదిరించి రూ.1.30 లక్షలు వసూలు.జనం వాయిస్, జయశంకర్‌ భూపాలపల్లి, అక్టోబర్ 6:పదో తరగతి నాటి పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్‌ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అనంతరం ఆ ఘటనను రహస్యంగా చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడతానంటూ బెదిరిస్తూ బాధితురాలిని పలుమార్లు వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా వీడియోలు బయటపెడతానని బెదిరించి రూ.1.30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి...