janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 12:34 pm Digital Edition : JANAM VOICE

మరిపెడ మండలం సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్.

మరిపెడ మండలం సోమ్లా తండాలో కార్డన్ సెర్చ్.

నాటుసారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడి.

నాటుసారా కాస్తున్న ఆరుగురు అదుపులోకి.

మరిపెడ,ఆగస్టు 22(జనం వాయిస్):

మహబూబాబాద్ జిల్లా పోలీసు అధికారి శబరిష్ ఆదేశాల మేరకు మరిపెడ సిఐ ఎల్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ మండలం సోమ్లా తండాలో కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అనుమానితుల ఇళ్లు,గుడుంబా స్థావరాలే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో బెల్లం,పంచదారతో నాటుసారా కాస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.సుమారు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.20 లీటర్ల తయారుచేసిన నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.నాటుసారా తరలింపునకు ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సి ఐ ఎల్ పవన్ కుమార్ మాట్లాడుతూ,గ్రామస్తులకు సమాజంలో జరుగుతున్న అంతర్జాల మోసాలు,రహదారి భద్రత,మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు,ఇంట్లో పిల్లల ప్రవర్తనపై అవగాహన కల్పించారు.చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్,చిన్నగూడూరు ఎస్సై కుశ కుమార్,సీరోలు ఎస్సై సంతోష్ తో పాటు సుమారు 20 మంది సిబ్బంది పాల్గొన్నారు…