janamvoice.com
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 11:42 am Digital Edition : JANAM VOICE

దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు  కృషి చేయాలి.-రామగుండం పోలీస్ కమిషనర్.

దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు  కృషి చేయాలి.

సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం:రామగుండం పోలీస్ కమిషనర్.

జనం వాయిస్, గోదావరిఖని:

జాతీయ ఐక్యత దినోత్సవం “రన్ ఫర్ యూనిటీలో” భాగంగా దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు  కృషి చేయాలని,అలాగే ప్రజలందరూ ఐక్యతగా,బందు భావన కలిగి ఉండాలని, ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్  150వ జయంతి పురస్కరించుకొని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు.

ముందుగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. రామగుండంపోలీస్ కమీషనరేట్  నుండి రామగుండం మున్సిపల్ T జంక్షన్ వరకు తిరిగి రామగుండంపోలీస్ కమీషనరేట్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది.ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ సేవలు, దేశాన్ని ఏక్త బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి మరింత సాధిస్తుందని అన్నారు.రజాకార్లను విచిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన స్వేచ్చ వాయువులు పీల్చుకునేల కృషి చేసిన  సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రుణపడి ఉండాలని సినీ నటులు సాగర్ అన్నారు. పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని, అందుకు పోలీసుల సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. యువత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి, సమైక్యతా భావం ప్రతి ఒక్కరికి చేరేలా తమ వంతు సహకారం అందించాలి అన్నారు.కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  రాజేశ్వర్ రావు, ఆర్ ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్, సినీ నటుడు సాగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.