janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 8:58 am Digital Edition : GATTU MAHESH

క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-తెలంగాణ పోలీసుల హెచ్చరిక

జనం వాయిస్,హైదరాబాద్‌,నవంబర్‌ 2:

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని నమ్మబలికి ప్రజలను మోసం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ఇటీవల అనేకమంది తమ కార్డు వివరాలు, ఓటీపీలు, పిన్‌ నంబర్లు తెలియజేసి మోసపోయినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు తెలిపారు.పోలీసులు జారీ చేసిన ప్రకటనలో, క్రెడిట్‌ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, ముఖ్యంగా కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులుగా చెప్పుకునే వారిని నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు అధికారులు ఎప్పుడూ లింకులు పంపరని, లిమిట్‌ పెంపు కోసం ఓటీపీ అడిగితే అది ఖచ్చితంగా మోసమని ప్రజలకు సూచించారు.అదేవిధంగా,ఏవైనా అనుమానాస్పద సందేశాలు, ఫోన్‌కాల్స్‌ వచ్చినప్పుడు వెంటనే వాటిని పట్టించుకోకుండా సమీప పోలీస్‌ స్టేషన్‌ లేదా సైబర్‌ క్రైమ్‌ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు.తెలంగాణ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ..జాగ్రత్తగా ఉండండి, మోసగాళ్లకు దూరంగా ఉండండి అని తెలిపారు.