సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం.
జనం వాయిస్, మంథని:
సైబర్ జగ్రూక్త దివాస్ సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గురువారం మంథని సోషల్ వెల్ఫేర్ స్కూల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంథని ఎస్సై డి.రమేష్ పాల్గోని మాట్లాడారు.ప్రస్తుత సాంకేతిక రోజులలో అందరు సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.ఏపీకే ఫైల్ ఓపెన్ చేయవద్దని,అపరిచిత ఫోన్ నెంబర్ల నుండి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని,అపరిచిత వ్యక్తులు చేసే వీడియో కాల్స్ కి స్పందించవద్దని,ఎవరికి ఓటిపి లు చెప్పవద్దని,ఆన్లైన్ ఉద్యోగాల మోసాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.అధిక డబ్బులు వస్తాయని ఆశపడి మోసపోవద్దని,ఎలాంటి డిజిటల్ అరెస్టులు లేవని ఎవరు అలాంటి వాటిని నమ్మవద్దని,ఏదైనా సైబర్ మోసం జరిగినట్టు గ్రహిస్తే వెంటనే 1930 కు ఫోన్ చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధ్యాపకులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గోన్నారు.