janamvoice.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 12:33 pm Digital Edition : JANAM VOICE

గోదావరిఖని లో ఘోర రోడ్డు ప్రమాదం.

గోదావరిఖని లో ఘోర రోడ్డు ప్రమాదం.

– సింగరేణి ఉద్యోగి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.

జనం వాయిస్, గోదావరిఖని:

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజేష్ థియేటర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో సింగరేణి సంస్థకు చెందిన శ్రీధర్ అనే ఉద్యోగి అక్కడికక్కడే మరణించగా కారులో ఉన్న లక్ష్మణ్, మహేందర్, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గోదావరిఖని చౌరస్తా నుంచి అతివేగంగా వచ్చిన కారు రాజేష్ థియేటర్ రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న నలుగురు అందులో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వారిని బలవంతంగా బయటికి తీశారు. ఈ సంఘటనలో శ్రీధర్ అనే కార్మికుడు మరణించగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.