janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 8:06 pm Digital Edition : JANAM VOICE

ఘోర రోడ్డు ప్రమాదం.

ఘోర రోడ్డు ప్రమాదం.

– ఇద్దరు యువకులు మృతి.

జనం వాయిస్, హనుమకొండ జిల్లా:

కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన నవీన్ కుమార్, నాగరాజు అనే యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా లక్ష్మీపూర్ గ్రామం సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనతో శనిగరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు గ్రామస్తులు సంతాపం తెలిపారు.